తెలుగు సామెతలు
- అడగందే అమ్మ అయినా పెట్టదు
- అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు
- అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అట
- అందని ద్రాక్షలు పుల్లన
- అందితే సిగ అందకపోతే కాళ్ళు
- అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం
- అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
- అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
- అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
- అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
- అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
- అయితే ఆదివారం కాకుంటే సోమవారం
- ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
- అంధుడికి అద్దం చూపించినట్లు
- అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ
- అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు
- అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు.
- అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు
- అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట
- అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు
- అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు
- అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు
- అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
- అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు
- అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు
- అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో
- అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు
- అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు
- అరిచే కుక్క కరవదు
- అర్దరాత్రి మద్దెల దరువు
- అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట
- అసలు లేవురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
- ఆంతా ఆతాను ముక్కే
- ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు, వలపు సిగ్గెరగదు
- ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం
- ఆకులు నాకేవాడింటికి మూతులు నాకేవాడు వాచ్చాడట
- ఆడది తిరిగి చెడుతుంది,మగవాడు తిరక్క చెడతాడు
- ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు
- ఆరాటపు పెళ్ళికొడుకు పెరంటాళ్ళ వెంట పడ్డ్డాడట
- ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ
- ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు
- ఆలస్యం అమృతం విషం
- ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే… చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయాడట.
- ఆవు చేలో మేస్తే, దూడ దుగాన/గట్టున మేస్తుందా?
- ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో?
- ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం
- ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
- ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
- ఇంట గెలిచి రచ్చ గెలువు
- ఇల్లు పీకి పందిరేసినట్టు
- ఇంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా?
- ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు
- ఇంట్లో పిల్లి వీధిలో పులి
- ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య
- ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు
- ఇల్లలకగానే పండగకాదు
- ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు అడిగాడంటొకడు
- ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు
- ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు
- ఉన్న మాటంటే ఉలుకెక్కువ
- ఉన్నది పోయె ఉంచుకొన్నది పోయె
- ఉయ్యాల్లొ పిల్ల పెట్టుకుని ఊరంతా వెతికినట్టు
- ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారి
- ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు
- ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి
- ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు
- ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట
- ఎంగిలిచేత్తో కాకిని తోలని వాడు
- ఎంత చెట్టుకి అంత గాలి
- ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు
- ఎక్కడైనా బావేగానీ వంగతోటకాడ కాదు
- ఎడ్డె తిక్కలామె తిరణాల పోతే, ఎక్కా దిగా సరిపోయింది
- ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట
- ఎనుబోతు మీద వాన కురిసినట్టు
- ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు
- ఏ మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్లు
- ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు
- ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మరాదు
- ఏమండీ కరణం గారూపాతర లో పడ్డారే అంటే, కాదు మషాకత్తు చేస్తున్నాను అన్నాడట
- ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది,అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని
- ఏరు ఏడామడ ఉండగానే చీర విప్పి చంకన బెట్టుకొందట
- ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు
- ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య
- ఒడిలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు
- ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి
- ఓరిస్తే ఓరుగల్లే పట్టణమవుతుంది
- కంచి లో చేయబోయే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి నడిచినట్లు
- కంచేచేను మేసినట్లు
- కందకి లేని దురద కత్తిపీటకెందుకు?
- కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవు
- కట్టుకున్నదానికి కట్టు బట్టల్లేవు కానీ, ఉంచుకున్నదానికి ఉన్ని బట్టలు కొంటానన్నాడట
- కడివెడు గుమ్మడికాయైనా కత్తిపీటకి లోకువే