Karthika Puranam Day 29 Parayanam ( Nov 30th ,2024 )
కార్తీక పురాణం 29వ రోజు పారాయణం
29 వ అధ్యాయము : అంబరీషుడు దూర్వాసుని పుజించుట – ద్వాదశీ పారాయణము.
అంబరీషుడు దుర్వాసుని పూజించుట
ద్వాదశి పారాయణము అత్రి మహాముని అగస్త్యువారితో ఈ విషముగా సుదర్శన చక్రము అంబరీషునక అభయ మిచ్చి ఉభయులను రక్షించి, భక్త కోటికీ దర్శన మిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు చెప్పానారంభించెను.
ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పదముల ఫై బడి దండ ప్రణామములాచరించి,పదములని కడిగి,
ఆ కడిగిన నీళ్లను తన శిరస్సు పై జల్లుకొని,
” ఓ ముని శ్రేష్టా! నేను సంసార మార్గ మందున్న యొక సామాన్య గృహస్తుడను నా శక్తి కొలది నేను శ్రీ మన్నారయణుని సేవింతును,ద్వాదశి వ్రతము జేసుకోనుచు ప్రజలకు ఎట్టికీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్య మేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్ని౦పుడు.
మీ యెడల నాకు అమితమైన అనురాగ ముండుటచేతనే తమకు ఆతిథ్య మివ్వ వలయునని ఆహ్వానిన్చితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించి నన్నును, నా వంశమును పావనము జేసి కృతార్దుని చేయుడు, మీరు దయార్ద్ర హృదయులు,ప్రధమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడ నైతిని.
మీ రాక వలన శ్రీ మహా విష్ణువు యొక్క సుధర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ ఉపకారమును మరువ లేకున్నాను.
మహానుభావా!
నా మన సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి.నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవ చేసినను యింకను ఋణ పడి యుండును. కాన, ఓ పుణ్య పురుషా! నాకు మరల నర జన్మ రాకుండా వుండేటట్లును, సదా, మీ బోటి ముని శ్రేష్ఠుల యందును-ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గల వాడనై యుండు నట్లును నన్నాశిర్విదించు ” డని ప్రార్ధించి,
సహాప౦క్తి భోజనమునకు దయ చేయుమని ఆహ్వానించెను.ఈ విధముగా తన పాదముల పై బడి ప్రార్ధించు చున్న అంబరీషుని ఆశీర్వదించి ” రాజా! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో,ఎవరు శత్రువుల కైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమాన మని ధర్మ శాస్త్రములు తెలియ జేయుచున్నవి.
నివు నాకుయిష్టుడవు తండ్రితో సమానుడ వైనావు. నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు అయుక్షినము కలుగును.అందు చేత నీకు నమస్కరించుట లేదు.నివు కోరిక యీ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను.
పవిత్ర ఏకాదశి వ్రత నిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగ జేసి నందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభవిన్చితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివే దిక్క యితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక, మరొకటి యగునా?” అని దుర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారముపంచ భక్ష్య పరమాన్నములతో సంతృప్తి గా విందార గంచి, అతని భక్తి ని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి,సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను.
ఈ వ్రుతాంత్త మంతయు కార్తిక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది ఓ అగస్త్య మహాముని!ద్వాదశి వ్రత ప్రభావ మెంతటి మహాత్మ్యము గలదో గ్రహించి తివిగదా! ఆ దినమున విష్ణు మూర్తి క్షీర సాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై చేసిన పుణ్యము యితర దినములలో పంచ దానములు చేసినంత ఫలమును పొందును.
ఏ మనుజుడు కార్తిక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవసము౦డి పగలెల్ల హరి నామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ, లేక, వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీ మన్నారయణుని ప్రీతీ కొరకు దానము లిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు యీ వ్రత ప్రభావము వలన నశించిపొవును. ద్వాదశి దినము శ్రీ మన్నానారా యణుకు ప్రీతీ కరమైన దినము కనుక ఆ నాడు ద్వాదశి ఘడియలు తక్కువగా యున్నాను.
ఆ ఘడియలు దాటకుండ గానే భుజింప వలెను. ఎవరికైతే వైకుంట ములో స్థిర నివాస మేర్పరచు కొని వుండాలని కోరిక వుండునో,అట్టి వారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండునూ చేయ వలెను. ఏ యొక్కటి యు విడువ కూడదు. శ్రీ హరికి ప్రీతీ కరమగు కార్తిక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కర మైనది.దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశ యింపకూడదు.
మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది అయినను అదే గొప్ప వృక్ష మైన విధముగా కార్తీక మాసములో నియమాను సారముగ జేసినా యే కొంచము పుణ్య మైనను, అది అవ సాన కాలమున యమ దూతల పాలు కానీ యక కాపాడును. అందులకే యీ కార్తిక మాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి. ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును- అని అత్రి మహాముని అగస్త్యనకు బోధించిరి.
ఏకోనత్రి౦శోధ్యాయము – ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము…
- స్వస్తీ…
మాఘ పురాణం ( 2nd Dec 2024 నుండి )