Karthika Puranam Day 27 Parayanam ( Nov 28th , 2024 )

Karthika Puranam Day 27 Parayanam ( Nov 28th , 2024 )

కార్తీక పురాణం 27వ రోజు పారాయణం

27 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట.

దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట

అత్రి మహా ముని అగస్త్యున కిట్లు వచించెను- కుంభ సంభవా! ఆ శ్రీ హరి దుర్వాసుని యెంతో ప్రేమతో జేర దీసి యింకను ఇట్లు చెప్పెను.

“ఓ దుర్వాస ముని! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆపది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ యివ్వవలెను గాన, అందులకు నేనంగికరించితిని.బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని యింట భుజింపక వచ్చినందులకు అతడు చింతా క్రాంతుడై బ్రాహ్మణ పరిఒవృతుడైప్రాయోపవేశ మొనర్పనెంచినాడు

ఆ కారణమూ వలన విష్ణు చక్రము నిన్ను భాదింపబూనెను.ప్రజారక్షనమే రాజా ధర్మముగాని, ప్రజా పీడనము గాదు.ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించవలెను.

ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని యెప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును. బ్రాహ్మణ హితకులకి న్యాయ శాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని శిక బట్టి లాగినవాడును, కాళ్లతో తన్నినవాడును,విపర ద్రవ్యమును హరించు వాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విపర పరిత్యాగ మొనరించిన వాడును బ్రహ్మ హ౦ తుకులే అగుదురు.

కాన, ఓ దుర్వాస మహర్షి! అంబరీషుడు ని గురించి – తప శ్శాలియు, విప్రోత్తముడును అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందు చున్నాడు. అయ్యో ! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే యని పరితాపము పొందుచున్నాడు కాబట్టి, నీవు వేగమే అబరిషుని కడకేగుము అందు వలన మీ ఉభయులకు శాంతి లభించును”అని విష్ణువు దూర్వా సునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.

సప్తవి౦శోధ్యాయము- ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.

Leave a Comment