Karthika Puranam Day 26 Parayanam ( Nov 27th , 2024 )
కార్తీక పురాణం 26వ రోజు పారాయణం
26 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని శరణు వేడుట.
దూర్వాసుడు శ్రీ హరి ని శరణు వేడుట – శ్రీ హరి బోధ
ఈ విధ ముగా అత్రిమహముని అగస్త్యునితో – దుర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాద మును తెలిపి, మిగిలన వృత్తంత మును ఇట్లు తెలియజే సేను.
ఆవిధ ముగా ముక్కోపి యైన దూర్వాసుడు భూలో కము, భువర్లో కము, పాతాళ లోకము, సత్యలో కములకు తిరిగి తిరిగి అన్ని లో కములలో ను తనను రక్షించువారు లేక పోవుటచె వైకుంఠ ముందున మహా విష్ణువు కడకు వెళ్లి.
వాసుదేవా! జగన్నాధా! శరణాగత రక్షణ బిరుదాంకి తా! రక్షింపుము.నీ భక్తు డైన అంబరీషున కు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను.ముక్కో పినై మహాపరాధ ము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడ వు . బ్రాహ్మణుడైన భగు మహర్షి నీ యురము పై తనిన్న ను సహించితివి.అ కాలిగురుతు నెటికి నీ నీ వక్ష స్దల మందున్నది. ప్రశాంత మనస్యుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము.
శ్రీ హరి! నీ చక్రాయుధము నన్ను చంప వచ్చుచున్న” దని దూర్వాసుడు శ్రీ మన్నారాయణుని పరి పరి విధములా ప్రార్దించెను. ఆ విధ ముగా దూర్వాసుడు అహంకార మును వదలి తనను ప్రార్ది0చుట చూచి – శ్రీ హరి చిరునవ్వు నవ్వి ” దూర్వాసా! నీ మాటలు యదార్ధ ములు.నీ వంటి తపోధ నులు నాకత్యంత ప్రియులు.
నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయ పడ కుందురా! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను.ప్రతియుగ ముందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభ వించే యాపాదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును.
నీ వ కారణముగా అంబరీ షుని శపించిటివి. నేను శత్రువు కైనను మనో వాక్కయులందు కూడా కీడు తలపెట్టేను. ఈ ప్రపంచ మందుగల ప్రాణి సమూహము నా రూ పముగానే జూతును. అంబరీ షుడు ధర్మయుక్త ముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని,అటువంటి నాభక్తుని నీవు అనేక విధ ములు దూషించితివి.నీ యెడమ పాద ముతో తన్నితివి.
అతని యింటికి నీవు అతిధివైవచ్చికుడ, నేను వేళకు రానియెడల ద్వాద శి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీ షున కు చెప్పా వైతివి. అతడు వ్రత భంగ మును కు భయపడి, నీ రాకకై చూచి జలపాన మును మాత్రమే జే సెను. అంత కంటే అతడు అ పరాధ ము యేమి చె సెను! చాతుర్వర్ణ ములవారికి భోజన నిషిద్ద ది న ములందు కూడా జలపానము దాహశాంతికి ని, పవిత్ర త కును చేయదగినదే కదా? జలపాన మొనరించిన మాత్ర మున నాభక్తు ని దూషించి శపించితివి.
అతడు వ్రత భంగ మునకు భయపడి జలపానము చేసినాడుకాని నిన్నువ మానించుటకు చేయాలేదె?నీవు మండి పడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను.
నేనుపుడు రాజ హృదయములో ప్రవేశించినాను.
నీ శాపఫలము పది జన్మలలో అనుభ వించుదున ని పలికిన వాడిని నే నే.అతడు నీ వలన భయము చే నన్ను శరణు వేడుచుండెను. కాని, తన దేహము తానూ తెలుసుకోనె స్దితిలో లేదు.నీ శాపమును అతడు వినలేదు. అంబరీ షుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు.నిరపరాధి, దయాశాలి, ధర్మత త్పరుడు.
అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అత నిని నిష్కరణ ముగా శపించితివి.విచారించ వలదు. ఆ శాపమును లో కో పకారమున కై నేనె అనుభ వింతును .అదెటులనిన నీ శాపములో నిది మొదటి జన్మ మత్స్యజన్మ . నే నీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము, సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్య రూపమెత్తు దును.
మరికొంత కాలమున కు దేవ దానవులు క్షిరసాగర మును మదుంచుటకు మందర పర్వత మును కవ్వముగా చే యుదురు. అ పర్వత మునునీటిలో మునగకుండ కూర్మ రూపమున నా విపున మోయుదును.వరాహజన్మ మెత్తి హిరణ్యాక్లుని వదంతును. నరసింహ జన్మ మెత్తి హిరణ్యకశిపుని జంపి, ప్రహ్లాదుని రక్షింతును.బలిచే స్వర్గ మునుండి పారద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గ మును
అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తి ని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూ భార మును తగ్గి౦తున.లోకకంటకు ఢ యిన రావణుని జంపిలో కోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును.
పిదప, యదువంశమున శ్రీ కృష్ణు నిగను, కలియుగ మున బుద్దుడుగను ,కలియుగాంత మున విష్ణు చి త్తుఢ ను విప్రునియింట ” కల్కి” యన పేరున జన్మించి, అశ్వారూడు౦డనై పరిభ్రమించుచు బ్రహ్మ దేషుల నందరను ముట్టు బెట్టుదును.నీవు అంబరీ షునకు శాపరు పమున నిచ్చిన పది జన్మలను యీ విధ ముగా పూర్తి చేయుదును.
ఇట్లు నా దశావతారములను సదాస్మరించు వారికి సమస్త పాపములు హరింపజే సి వైకుంఠప్రాప్తి నోసంగుదును.ఇది ముమ్మాటికి తథ్యము.
షడ్వి౦శోధ్యాయము- ఇరవయ్యారో రోజు పారాయణము సమాప్తము…