Karthika Puranam Day 24 Parayanam ( Nov 25th , 2024 )
కార్తీక పురాణం 24వ రోజు పారాయణం
24 వ అధ్యాయము : అంబరీషుని ద్వాదశీ వ్రతము.
అంబ రిషుని ద్వాదశి వ్రతము
అత్రి మహాముని మరల అగస్త్యునితో, ” ఓ కుంభ సంభవా! కార్తీక వ్రత ప్రభావము నెంత వి చా రించిన నూ,యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసి నంత వరకు వివరింతును.అలకింపుము.
గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసిన ౦దు వలన ను, సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానా దు లోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీ మన్నారయణుని నిజ తత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్దలతో దాన ధర్మములు చేయు వారికీ ని అంత ఫలమే కలుగును.
ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము యితర దినములలో చేసిన ఫలము కంటె వేయి రెట్లు అధికము కా గలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధాన మెట్లో చెప్పెదను. వినుము.
కార్తీక శుద్ధ దశమి రోజున, పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా యె కాదశి రోజున వ్రతమూ చేయక శుష్కోపవాస ముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాత నే భుజింప వలయును. దీని కొక యితిహాసము కాలదు.దానిని కూడా వివరించెదను. సావదనుడవై అలకింపుము”మని యిట్లు చెప్పు చున్నాడు.
పూర్వము అంబరీషుడను రాజు కలడు . అతడు పరమ భగవ తోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయు చుండెడివాడు. ఒక ద్వాదశి నాడు, ద్వాదశి ఘడియలు స్వల్ప ముగా నుండెను. అందుచే ఆ రోజు పెందల కడనె వ్రతమును ముగించి బ్రాహ్మణాసమారాధన చేయ దలచి సిద్దముగా నుండెను.
అదే సమయమున కచ్చటకు కోప స్వభావుడగు దుర్వాసుడు వచ్చెను.అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణము చేయ వలయు ను గాన, తొందరగా స్నానమున కై రమ్మన మని కోరెను.
దుర్వాసుడ౦దులక౦గీకరించి సమీపమున గల నదికి స్నానమున కై వెడలెను.అంబరీషుడు యెంత సేపు వేచి యున్న నూ దుర్వాసుడు రాలేదు.ద్వాదశి ఘడియలు దాటి పోవు చున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు నుకొనెను. ” ఇంటి కొచ్చిన దుర్వాసుని భోజనము నకు రమ్మంటిని .
ఆ ముని నదికి స్నానముకు వెళ్లి యింత వరకు రాలేదు. బ్రాహ్మణు న కతిధ్య మిత్తునని మాట యిచ్చి భోజనం పెట్టక పోవుట మహా పాపము.అది గృహస్తునకు ధర్మము గాదు. అయన వచ్చు వరకు ఆగితినా ద్వాదశి ఘడియలు దాటి పొవును. వ్రత భంగమగును. ఈ ముని మహా కోప స్వభావము గలవాడు.
ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకే మియు తోచ కున్నది. బ్రాహ్మణా భోజన మతిక్రమిం చ రాదు.ద్వాదశి ఘడియలు మించిపో కూడదు.ఘడియలు దాటి పోయిన పిదప భుజించిన యెడల, హరి భక్తి ని వదలిన వాడనగుదను.
ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పల మగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు,భోజనము చేసిన దుర్వాసునకు కోపము వచ్చును.అదియు గాక, యీ నియమమును నెను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు జేసినా పుణ్యములు నశించును. దానికి ప్రాయ శ్చితము లేదు.అని అలోచించి ” బ్రాహ్మణ శాపమునకు భయము లేదు.
ఆ భయము ను శ్రీ మహా విష్ణువేబోగట్ట గలడు. కావున నెను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే వుత్తమము. అయిన ను పెద్దలతో ఆలోచించుట మంచి”దని, సర్వ జ్ఞు లైన కొందరు
పండితులను రావించి వారితో యిట్లు చెప్పెను.
ఓ పండిత శ్రేష్టులారా! నిన్నటి దినమున యే కాదశి యగుటం జేసి నేను కటిక వుపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మత్రమే ద్వాదశి ఘదియలున్నవి. ద్వాదశి ఘడియలలో నే భుజించ వలసి యున్నది. ఇంతలో నా యింటికి దుర్వాస మహాముని విచ్చేసిరి.అ మహామునిని నేను భోజనమునకు ఆహ్వాని౦చితిని. అంధుల కాయన అంగీకరించి నదికి స్నానర్ధ మై వెళ్లి ఇంత వరకూ రాకుండెను.
ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటి పోవు చున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింప వచ్చునా? లేక, వ్రత భ౦గమును సమ్మతించి ముని వెచ్చే వరకూ వేచి యుండ వలెనా?ఈ రెండిటిలో యేది ముఖ్య మైనదో తెలుప వలసిన”దని కోరెను. అంతట యా ధర్మ జ్ఞులైన పండితులు, ధర్మ శాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసికొని, దిర్ఘముగా అలోచించి “
మహా రాజా! సమస్త ప్రాణి కోటుల గర్భ కు హరములందు జట రాగ్ని రూపమున రహస్యముగా నున్న అగ్ని దేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులుభుజించిన చతుర్వి ధాన్నమును పచనముగా వించి దేహే౦ద్రి యలకు శక్తి నొసంగు చున్నాడు. ప్రాణ వాయువు సహాయముతో జట రాగ్ని ప్రజ్వరిల్లును.
అది చెలరేగిన క్షు ద్భా ధ- దప్పిక కలుగును. అ తపము చల్లార్చ వలెనన్న అన్నము, నిరు పుచ్చుకొని శాంత పరచ వలెను. శరీరమునకు శక్త కలుగ చేయువాడు అగ్ని దేవుడు, దేవత లందరి కంటే అధికుడై దేవ పుజ్యు డైనాడు. ఆ యగ్ని దేవునందరు సదా పూజింప వలెను.
గృహస్తు, యింటికి వచ్చిన అతిధి కదా జాతి వాడైనను ‘భోజన మిడుదు’ నని చెప్పి వాణికి పెట్టకుండా తినరాదు.
అందులో నూ వేద వేదాంగ విద్య విశార దుడును, మహత పశ్శలియు, సదా చార సంపన్నుడును అయిన దుర్వాస మహా మునినిభోజనమునకు పిలిచి వణికి పెట్టకుండా తాను భుజించుట వలన మహా పాపమూ కలుగును.అందువలన అయుక్షిణము కలుగును. దుర్వాసు నంతటి వానిని అవమాన మొనరించిన పాపము సంప్రాప్త మగను” అని విషాద పరచిరి.
చతుర్వి ౦ శో ధ్యాయము – ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము….