Karthika Puranam Day 5 Parayanam ( Nov 6th , 2024 )

Karthika Puranam Day 5 Parayanam

కార్తీక పురాణం 5వ రోజు పారాయణం

5 వ అధ్యాయము : వనభోజన మహిమ, కిరాతమూషికములు మోక్షము నొందుట.

(వనభోజన మహిమ)

ఓ జనక మహారాజా! కార్తీకమాసములో స్నానదాన పూజానంతరమున శివాలయమందుగాని, విష్ణ్యాలయమునందుగాని శ్రీమద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును. అట్లు చేసిన వారి సర్వ పాపములును నివృత్తియగును.

ఈ కార్తిక మాసములో కరవీరపుష్పములు శివకేశవులకు సమర్పించినవారు వైకుంఠమునకు వెళ్లుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడ కందలి శ్లోకములో నొక్క పాదమైననూ కంఠస్థ మొనరించిన యెడల విష్ణుసాన్నిధ్యం పొందుదురు.

కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండివున్న ఉసిరి చెట్టుక్రింద సాలగ్రామమును యధోచితంగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడను భుజించ వలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టుక్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయును.

వీలునుబట్టి ఉసిరిచెట్టు క్రింద పురాణకాలక్షేపం చేయవలయును. ఈ విధంగా చేసిన బ్రాహ్మణపుత్రునకు నీచజన్మము పోయి నిజరూపము కలిగెను – యని వశిష్ఠులవారు చెప్పిరి. అది విని జనకరాజు “మునివర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచజన్మ మేల కలిగెను? దానికి గల కారణమేమి” యని ప్రశ్నించగా, వశిష్ఠులవారు యీ విధంబుగా చెప్పనారంభించిరి.

కిరాత మూషికములు మోక్షము నొందుట:

రాజా! కావేరీతీరమందొక చిన్ని గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వానిపేరు శివశర్మ. శివశర్మ చిన్నతనమునుండి భయభక్తులు లేక అతిగారాబముగ పెరుగుట వలన నీచసహవాసములు చేసి దురాచార పరుడై మెలగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనా డతని తండ్రి కుమారుని పిలిచి “బిడ్డా! నీ దురాచారముల కంతులేకుండా వున్నది.

నీ గురించి ప్రజలు పలువిధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కాన, నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి, శివకేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసినయెడల, నీవు చేసిన పాపములు తొలగుటయేకాక నీకు మోక్షప్రాప్తికూడా కలుగును.

కాన,నీవు అటులచేయు” మని బోధించెను. అంతట కుమారుడు ‘తండ్రీ! స్నానము చేయుట వంటిమురికి పోవుటకు మాత్రమేకాని వేరు కాదు! స్నానం చేసి పూజలు చేసినంతమాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని యింటిలోనే పెట్టుట మంచిదికాదా?’ అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను.

కుమారుని సమాధానము విని, తండ్రీ “ఓరీ నీచుడా! కార్తీకమాస ఫలము నంత చులకనగా చూస్తున్నావు కాన, నీవు అడవిలో రావిచెట్టు తొఱ్ఱయందు యెలుకరూపములో బ్రతికెదవుగాక” అని కుమారుని శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి “తండ్రీ! క్షమింపుము. అజ్ఞానంధకారములో బడి దైవమునూ, దైవకార్యములనూ యెంతో చులకనచేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని.

ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకా శాపవిమోచన మెప్పు డే విధముగా కలుగునో దానికితగు తరుణోపాయమేమో వివరింపు” మని ప్రాధేయపడెను. అంతట తండ్రి “బిడ్డా! నాశాపమును అనుభవించుచు మూషికమువై పడియుండగా నీ వెప్పుడు కార్తీకమాహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తినొందుదువు” అని కుమారుని వూరడించెను. వెంటనే శివశర్మ యెలుక రూపముపొంది అడవికిపోయి, ఒక చెట్టుతొఱ్ఱలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను.

ఆ అడవి కావేరీ నదీతీరమునకు సమీపమున నుండుటచే స్నానార్ధమై నదికి వెళ్లువారు అక్కడనున్న యా పెద్దవటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి, లోకాభి రామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్లుచుండెడివారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీకమాసములో నొకరోజున మహర్షియగు విశ్వామిత్రులవారు శిష్యసమేతముగా కావేరీనదిలో స్నానార్థమై బయలుదేరారు.

అట్లు బయలుదేరి ప్రయాణపు బడలికచేత మూషికమువున్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీకపురాణమును వినిపించుచుండిరి. ఈలోగా చెట్టుతొఱ్ఱలో నివసించుచున్న మూషికము వీరిదగ్గరనున్న పూజాద్రవ్యములలో నేదైనా తినేవస్తువు దొరుకుతుందేమోనని బైటకు వచ్చి చెట్టుమొదట నక్కియుండెను.

అంతలో నొక కిరాతకుడు వీరిజాడ తెలుసుకొని, ‘వీరు బాటసారులైవుందురు. వీరివద్దనున్నధన మపహరించవచ్చు ‘ ననెడు దుర్భుద్ధితో వారికడకు వచ్చిచూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి ” మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనంతో నామనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది.

గాన, వివరింపుడు” అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రులవారు “ఓయీ కిరాతకా! మేము కావేరీ నదీ స్నానార్థమై యీ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీకపురాణము పఠించుచున్నాము. నీవును యిచట కూర్చుండి సావధానుడవై యాలకింపుము” అని చెప్పిరి.

అటుల కిరాతకుడు కార్తీకమహాత్మ్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి, పురణశ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకుపోయెను. అటులనే ఆహారమ్మునకై చెట్టుమొదట దాగివుండి పురాణమంతయు వినుచుండిన యెలుకకూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నొంది “మునివర్యా! ధన్యోస్మి. తమ దయవల్ల నేను కూడా యీ మూషిక రూపమునుండి విముక్తుడనైతి” నని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను.

కనుక ఓ జనకా! ఇహములో సిరిసంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, యితరులకు వినిపించవలెను.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ఐదవ యధ్యాయము పారాయణము సమాప్తము.

The Karthika Puranam is a part of the larger Puranic tradition in Hinduism, and it is primarily focused on the significance of the Karthika month (Kartika Masa), which is the eighth month of the Hindu lunar calendar, typically falling between mid-October and mid-November.

In Telugu culture, Karthika Puranam is often recited during the Karthika month and it highlights various religious stories, rituals, and the importance of worshiping Lord Shiva and other deities during this period.

Key Themes of Karthika Puranam:

  1. Karthika Month:
  • The month of Karthika is considered highly auspicious, particularly for performing spiritual practices such as fasting, lighting oil lamps (Deepam), and offering prayers to Lord Shiva and Goddess Lakshmi.
  • Special significance is given to the Karthika Deepam festival, which involves the lighting of lamps (deepalu) at temples and homes to bring prosperity and remove darkness (symbolizing ignorance).
  1. Lord Shiva’s Worship:
  • Karthika Puranam extols the worship of Lord Shiva, especially during this month, as it is believed that performing rituals and prayers dedicated to Lord Shiva brings immense spiritual benefits and grants peace, health, and wealth.
  1. Legends and Stories:
  • The text narrates various mythological stories related to Karthika Masa, such as the importance of the Karthika Vratam, the story of Karttikeya, and other incidents related to deities that are connected to the month.
  1. Spiritual Practices:
  • Devotees are encouraged to take part in rituals such as oil lamp lighting, fasting, and other forms of worship during the Karthika month, which are believed to lead to the purification of mind and soul, as well as gaining divine blessings.
  1. Importance of Karthika Deepam:
  • The Karthika Deepam festival, particularly celebrated in temples like Tiruvannamalai in Tamil Nadu, is a central theme. It marks the lighting of a massive lamp on top of a hill, symbolizing the light of knowledge and the supreme consciousness.

Telugu Karthika Puranam

In the Telugu-speaking states, the Karthika Puranam is often recited in temples, homes, and during festivals. Devotees gather to hear or chant this Puranam as part of the religious observances. Special Karthika Purnima (the full moon day of the month) celebrations are held with fervor, where the narrative of the Puranam is elaborated, and many people undertake the Karthika Vratam.

Common Rituals During Karthika Month:

  • Lighting Lamps (Deepalu): It is a tradition to light oil lamps every evening during the month of Karthika. This is seen as a way to invite divine blessings and remove darkness and ignorance.
  • Water Offerings: Many people take a ritual bath early in the morning during the Karthika month and offer prayers to Lord Vishnu or Lord Shiva.
  • Visiting Temples: Pilgrimages to temples dedicated to Lord Shiva, like Kailasa Giri, Annavaram, and others, are common practices.

If you’re looking for more specific verses or stories from the Karthika Puranam in Telugu, let me know! I can help with translations or interpretations of some key parts.

Leave a Comment