Telugu Samethalu

తెలుగు సామెతలు

  • అడగందే అమ్మ అయినా పెట్టదు
  • అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు
  • అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అట
  • అందని ద్రాక్షలు పుల్లన
  • అందితే సిగ అందకపోతే కాళ్ళు
  • అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం
  • అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
  • అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
  • అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
  • అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
  • అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
  • అయితే ఆదివారం కాకుంటే సోమవారం
  • ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
  • అంధుడికి అద్దం చూపించినట్లు
  • అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ
  • అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు
  • అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు.
  • అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు
  • అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట
  • అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు
  • అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు
  • అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు
  • అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
  • అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు
  • అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు
  • అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో
  • అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు
  • అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు
  • అరిచే కుక్క కరవదు
  • అర్దరాత్రి మద్దెల దరువు
  • అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట
  • అసలు లేవురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
  • ఆంతా ఆతాను ముక్కే
  • ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు, వలపు సిగ్గెరగదు
  • ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం
  • ఆకులు నాకేవాడింటికి మూతులు నాకేవాడు వాచ్చాడట
  • ఆడది తిరిగి చెడుతుంది,మగవాడు తిరక్క చెడతాడు
  • ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు
  • ఆరాటపు పెళ్ళికొడుకు పెరంటాళ్ళ వెంట పడ్డ్డాడట
  • ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ
  • ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు
  • ఆలస్యం అమృతం విషం
  • ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే… చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయాడట.
  • ఆవు చేలో మేస్తే, దూడ దుగాన/గట్టున మేస్తుందా?
  • ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో?
  • ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం

  • ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
  • ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
  • ఇంట గెలిచి రచ్చ గెలువు
  • ఇల్లు పీకి పందిరేసినట్టు
  • ఇంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా?
  • ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు
  • ఇంట్లో పిల్లి వీధిలో పులి
  • ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య
  • ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు
  • ఇల్లలకగానే పండగకాదు
  • ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు అడిగాడంటొకడు

  • ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు
  • ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు
  • ఉన్న మాటంటే ఉలుకెక్కువ
  • ఉన్నది పోయె ఉంచుకొన్నది పోయె
  • ఉయ్యాల్లొ పిల్ల పెట్టుకుని ఊరంతా వెతికినట్టు
  • ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారి
  • ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు
  • ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి
  • ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు

  • ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట
  • ఎంగిలిచేత్తో కాకిని తోలని వాడు
  • ఎంత చెట్టుకి అంత గాలి
  • ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు
  • ఎక్కడైనా బావేగానీ వంగతోటకాడ కాదు
  • ఎడ్డె తిక్కలామె తిరణాల పోతే, ఎక్కా దిగా సరిపోయింది
  • ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట
  • ఎనుబోతు మీద వాన కురిసినట్టు
  • ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు
  • ఏ మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్లు
  • ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు
  • ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మరాదు
  • ఏమండీ కరణం గారూపాతర లో పడ్డారే అంటే, కాదు మషాకత్తు చేస్తున్నాను అన్నాడట
  • ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది,అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని
  • ఏరు ఏడామడ ఉండగానే చీర విప్పి చంకన బెట్టుకొందట
  • ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు
  • ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య

  • ఒడిలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు
  • ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి
  • ఓరిస్తే ఓరుగల్లే పట్టణమవుతుంది

  • కంచి లో చేయబోయే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి నడిచినట్లు
  • కంచేచేను మేసినట్లు
  • కందకి లేని దురద కత్తిపీటకెందుకు?
  • కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవు
  • కట్టుకున్నదానికి కట్టు బట్టల్లేవు కానీ, ఉంచుకున్నదానికి ఉన్ని బట్టలు కొంటానన్నాడట
  • కడివెడు గుమ్మడికాయైనా కత్తిపీటకి లోకువే

Leave a Comment